మధురై: నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ విమర్శించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని ఆయన అన్నారు. అయితే ఏవిధంగా మేలు జరలేదన్న దానిపై వివరించేందుకు ఆయన ఇష్టపడలేదు.
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం కృషి చేయాలన్నారు. చైనా నుంచి బాణాసంచా దిగుమతులను నిషేధించాలని ఆయన కోరారు. బాణాసంచా దిగుమతికి అనుమతిస్తే శివకాశితో సహా దక్షిణ తమిళనాడులో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడతారని వాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.
'వంద రోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు'
Published Sun, Sep 7 2014 8:29 PM | Last Updated on Wed, Aug 15 2018 2:51 PM
Advertisement