ధనుష్‌ ఆధారాలు సమర్పించండి | Madurai court Orders on Dhanush Evidence | Sakshi
Sakshi News home page

ధనుష్‌ ఆధారాలు సమర్పించండి

Published Sun, Feb 19 2017 1:51 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

ధనుష్‌  ఆధారాలు సమర్పించండి - Sakshi

ధనుష్‌ ఆధారాలు సమర్పించండి

నటుడు ధనుష్‌కు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని మదురై కోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.

మదురైకోర్టు ఆదేశం
తమిళసినిమా: నటుడు ధనుష్‌కు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని   మదురై కోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.ధనుష్‌ తమ కొడుకు అంటూ మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసుపై ఇప్పటికే  పలు మార్లు విచారణ జరిగింది.దనుష్‌ తరపు న్యాయవాది కధిరేశన్‌ దంపతుల ఆరోపణలో నిజం లేదనీ,అందువల్ల ఈ పిటీషన్‌ను కొట్టివేయాల్సిందిగా పిటీషన్‌లో పేర్కొన్నారు.తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కదిరేశన్‌ దంపతులు కోర్టుకు విన్నవించకున్న నేపద్యంలో ధనుష్‌ తరపున కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

కాగా శుక్రవారం మరోసారి విచారణకు రాగా ఇరు తరపు ఆధారాలను  న్యాయమూర్తి చొక్కలింగం పిరిశీలించారు.ధనుష్‌ చెన్నైలోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను,ఆయన పదవ తరగతి పరిక్షలు రాసి,2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో తన పేరును నమోదు చేసినట్లు, ఆయన తరపు న్యాయవాది సమర్పించిన ఆధారాలు పరిశీలించగా ధనుష్‌ నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై 2002 మార్చి నెలలో సెన్సార్‌ పూర్తి చేసుకుని మే నెలలో విడుదలయ్యింది.,కాగా ధనుష్‌ న్యాయవాది కోర్టుకు సమర్పించిన ఆధారాలకు కధిరేశన్‌ సమర్పించిన ఆధారాలకు పొంతన తేకపోవడంతో నటుడు ధనుష్‌కు సంబంధించిన పుట్టుమచ్చ,తదితర ఆధారాలను కోర్టుకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement