
లారీలో పేలిన టిఫిన్ బాక్స్ బాంబు
తమిళనాడులో మదురై సమీపంలో వైగై నది దగ్గర ఆపినవున్న లారీలో టిఫిన్ బాక్స్ బాంబు పేలింది.
మదురై: తమిళనాడులో మదురై సమీపంలో వైగై నది దగ్గర ఆపినవున్న లారీలో టిఫిన్ బాక్స్ బాంబు పేలింది. టిఫిన్ బాక్సులో పేలుడు పదార్థాలు ఉంచినట్టు గుర్తించారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా బాంబు శక్తిమంతమైనది కాకపోవడంతో ఎవరూ గాయపడలేదు. లారీ మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నది.
స్టేషనరీ సామాన్లు తీసుకెళ్తున్న ఈ లారీని నది దగ్గర ఎందుకు పార్క్ చేశారు? ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు? అన్న విషయాలు తెలియరాలేదు. కొందరు గుర్తు తెలియని దుండగులు టిఫిన్ బాక్సు బాంబును లారీలో విసిరివేసి ఉంటారని లేదా లారీలో అమర్చిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మదురై, పరిసర ప్రాంతాల్లో గత పదేళ్లలో పోలీసులు పది టిఫిన్ బాక్స్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.