సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రత కల్పించే విధంగా క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)ను తమిళనాడులోని మదురై జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మూడు విభాగాల సమన్వయంతో ఈ వింగ్ ఏర్పాటు కాగా, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరును ప్రకటించారు. తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. పరువు కోసం హతమార్చడానికి కూడా వెనుకాడటం లేదు. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో అనేకమంది ప్రియులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు.
గత ఏడాది శంకర్ అనే ప్రేమికుడిని పట్టపగలు నడిరోడ్డులో హత్యచేయడాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురై జిల్లాలో ప్రపథమంగా ఈ ప్రత్యేక వింగ్ సోమవారం ఏర్పాటైంది. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో క్రైం ప్రివెన్షన్ సెల్(సీపీసీ) పేరుతో ఈ విభాగాన్ని ప్రకటించారు. అలాగే, తమను సంప్రదించాలంటూ 0452–2346302 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు.
ప్రేమ వివాహాలకు ప్రత్యేక వింగ్
Published Tue, Aug 8 2017 9:22 AM | Last Updated on Mon, Oct 8 2018 4:05 PM
Advertisement