చెన్నై: తను చనిపోయే ముందు 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్.. తనకు ప్రమాదం ఎదురవబోతుందని ముందే గమనించి అప్రమత్తమైన డ్రైడర్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన అయిదు నిమిషాల్లోనే గుండెపోటుతో మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి సమీపంలో చోటుచేసుకుంది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఎమ్ ఆరుముగమ్(44) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కండక్టర్ భాగ్యరాజ్‌తో కలిసి అరప్పాలయం నుంచి కొడైకెనాల్‌కు బస్సు నడుపుతున్నాడు.
ఉదయం 6.20 నిమిషాలకు అరప్పాలయం నుంచి బస్సు బయలు దేరింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. బస్సు బయల్దేరిన అయిదు నిమిషాలకు గురు థియేటర్ వద్దరు చేరుకోగానే అరుముగమ్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు పార్క్ చేసి కండక్టర్‌ను సమాచారం అందించాడు. అనంతరం బస్సులోని సీట్లో కుప్పకూలిపోయాడు. కండక్టర్ వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. కానీ అంబులెన్స్ వచ్చేలోపే డ్రైవర్ అరుముగమ్ గుండెపోటుతో మరణించాడు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి!
టీఎన్‌ఎస్‌టీసీ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ యువరాజ్ మాట్లాడుతూ.. ఆరుముగం ఆర్టీసీలో డ్రైవర్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. 30 మంది ప్రాణాలను కాపాడిన అతని ఆదర్శప్రాయమైన సాహసం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరిమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం
Comments
Please login to add a commentAdd a comment