చెన్నై: ప్రస్తుత రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు కుమ్మరించాల్సిందే. డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవడమంటే పెద్ద వింతే. అది కూడా 79 ఏళ్ల వయసులో గెలవడమంటే మాములు విషయం కాదు. వయసు పైబడింది కదా అని అందరిలా కృష్ణారామా అనుకుంటూ ఇంట్లో కూర్చోలేదా బామ్మ. వివరాల్లోకెళ్తే.. మధురై జిల్లాలోని మెలురు తాలూకా, అరిత్తపట్టి గ్రామానికి చెందిన వీరమ్మల్ అజగప్పన్ అనే 79 ఏళ్ల వృద్ధురాలు ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలన్న కోరికతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసింది. ఆమెకు ప్రత్యర్థులుగా మరో ఏడుగురు పోటీ చేశారు.
చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!
వారంతా వీరమ్మల్‌ను చూసి ఇంత వయసులో ఆమె గెలుస్తుందా అనుకున్నారు. గెలిచినా ఏ పని చేయలేదంటూ ప్రచారం కూడా చేశారు. అందుకే తమకే ఓటు వేసి గెలిపించాలని ఆ గ్రామ ప్రజలను కోరారు. కానీ.. అందుకు భిన్నంగా ఆ ఊరి ప్రజలు వీరమ్మల్‌ను 190 ఓట్ల మెజారిటీతో గెలిపించి.. ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఈ వయసులో విజయం ఎలా సాధ్యమైందని బామ్మను ప్రశ్నించగా.. గ్రామంలోని యువకులే తనను గెలిపించారని చెప్పుకొచ్చింది. తన వయస్సును లెక్కచేయకుండా.. గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెల్పింది. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనిని వీరమ్మల్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment