మధురై ఎక్స్‌ప్రెస్‌కు సాంకేతిక సమస్య తలెత్తి సుమారు గంటన్నర పాటు నిలిచిపోయింది. శనివారం కాచిగూడ నుంచి గద్వాల మీదుగా మధురై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్
గద్వాల రైల్వేస్టేషన్‌లో గంటన్నర పాటు నిలిపివేత
గద్వాలన్యూటౌన్ : మధురై ఎక్స్‌ప్రెస్‌కు సాంకేతిక సమస్య తలెత్తి సుమారు గంటన్నర పాటు నిలిచిపోయింది. శనివారం కాచిగూడ నుంచి గద్వాల మీదుగా మధురై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఉదయం 9.40గంటల ప్రాంతంలో గద్వాల రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్టార్ట్ కాలేదు.
దీంతో డ్రైవర్ స్టేషన్ మాస్టర్‌కు విషయాన్ని తెలియజేశారు. స్టేషన్ మాస్టర్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని అందించారు. వారు మానవపాడు రైల్వేస్టేషన్‌లో ఉన్న మరో ఇంజన్‌ను గద్వాలకు తెప్పించారు. 11.20గంటల ప్రాంతంలో మధురై ఎక్స్‌ప్రెస్‌కు తగిలించి పంపారు. సుమారు గంటన్నర పాటు గద్వాల స్టేషన్‌లోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.