అన్నాడీఎంకే మీటింగ్లో బాంబుల కలకలం | 4 Bombs Recovered From AIADMK Meeting Venue In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే మీటింగ్లో బాంబుల కలకలం

Published Wed, Jan 13 2016 1:16 PM | Last Updated on Thu, May 24 2018 12:08 PM

అన్నాడీఎంకే మీటింగ్లో బాంబుల కలకలం - Sakshi

అన్నాడీఎంకే మీటింగ్లో బాంబుల కలకలం

తమిళనాడులోని మదురైలో మరోసారి బాంబుల కలకలం రేగింది. అధికార అన్నా డీఎంకే సమావేశ వేదికలో నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం పోలీసులు తెలిపారు.

మదురై: తమిళనాడులోని మదురైలో మరోసారి బాంబుల కలకలం రేగింది. అధికార అన్నా డీఎంకే సమావేశ వేదికలో నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం పోలీసులు తెలిపారు. వీటిలో రెండు నాటు బాంబులు, మరో రెండు పెట్రోలు బాంబులుగా గుర్తించారు.

మంగళవారం రాత్రి అన్నా డీఎంకే పార్టీ సమావేశం ప్రారంభానికి ముందు రెండు బాంబులను గుర్తించారు. సమావేశానంతరం మరో రెండు బాంబులను ఉన్నట్టు కనుగొన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత ఆదివారం మదురైలోనే తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు నివాసంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. మదురైలోని పలు ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బాంబులు వేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇది తన ప్రత్యర్థుల కుట్ర అని మంత్రి ఆరోపించారు. మంగళవారం పార్టీ సమావేశాన్ని కూడా ఆయనే నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement