Madras HC Fines Actor Vijay Rs 1 Lakh Over Tax Evasion For His Rolls-Royce - Sakshi
Sakshi News home page

Vijay: దళపతి విజయ్‌కు షాక్‌, పన్నుతో పాటు ఎక్స్‌ట్రా ఫైన్‌!

Published Tue, Jul 13 2021 4:53 PM | Last Updated on Tue, Jul 13 2021 5:50 PM

Madras HC Fines Actor Vijay Rs 1 Lakh Over Tax Evasion For His Rolls Royce - Sakshi

దళపతి విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ లగ్జరీ కారుకు పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అతడు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ సందర్భంగా పన్ను ఎగ్గొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌరులు చట్టబద్ధంగా నడుచుకునేలా ఆదర్శంగా ఉండాల్సిన సినీతారలే ఇలా పన్ను కట్టేందుకు వెనకాడటమేంటని ప్రశ్నించింది.

'హీరోలను సినిమాల్లో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు, అవినీతి మీద యుద్ధం ప్రకటించినట్లు చూపిస్తారు. కానీ నిజజీవితంలో నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా, సరైన సమయానికి పన్ను కట్టేవాడే అసలైన హీరో' అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పన్ను చెల్లించడానికి విజయ్‌కు రెండు వారాల గడువిచ్చింది. దీంతోపాటు పన్ను కట్టకుండా ఉన్నందుకు హీరోకు లక్ష రూపాయల ఫైన్‌ విధించింది. ఈ రుసుమును తమిళనాడు సీఎం కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు వినియోగించాలని ప్రభుత్వానికి సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement