Rolls-Royce car
-
దళపతికి షాకిచ్చిన హైకోర్టు, వాళ్లే రియల్ హీరోలు అంటూ చీవాట్లు
దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారుకు పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అతడు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ సందర్భంగా పన్ను ఎగ్గొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌరులు చట్టబద్ధంగా నడుచుకునేలా ఆదర్శంగా ఉండాల్సిన సినీతారలే ఇలా పన్ను కట్టేందుకు వెనకాడటమేంటని ప్రశ్నించింది. 'హీరోలను సినిమాల్లో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు, అవినీతి మీద యుద్ధం ప్రకటించినట్లు చూపిస్తారు. కానీ నిజజీవితంలో నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా, సరైన సమయానికి పన్ను కట్టేవాడే అసలైన హీరో' అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పన్ను చెల్లించడానికి విజయ్‌కు రెండు వారాల గడువిచ్చింది. దీంతోపాటు పన్ను కట్టకుండా ఉన్నందుకు హీరోకు లక్ష రూపాయల ఫైన్ విధించింది. ఈ రుసుమును తమిళనాడు సీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు వినియోగించాలని ప్రభుత్వానికి సూచించింది. This is Vijay's RollsRoyce Ghost that is making headlines today. Purchased in 2013 for over 8 cr, attracting entry tax of approx 1.6 cr, which the actor had challenged. He was chastised strongly by Madras HC for attempted tax evasion & asked to pay 1 lakh to TN CM covid fund. pic.twitter.com/hl3s0zUw9I — Kasturi Shankar (@KasthuriShankar) July 13, 2021 -
ఆయన గ్యారేజ్‌లో ఆరు రోల్స్ రాయిస్ కార్లు..
లండన్ : రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకోవాలనుకునే కల చాలామందికి కలగానే మిగిలిపోతుంది. బ్రిటన్‌లో స్ధిరపడిన భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రూబెన్ సింగ్ మాత్రం ఏకంగా 15 రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నాడు. సింగ్ ఇటీవల రూ 50 కోట్లకు పైగా వెచ్చించి ఆరు రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఇటీవల లాంఛ్ అయిన మూడు ఫాంటాన్ లగ్జరీ సెడాన్లున్నాయి. లండన్‌లో ఫైనాన్షియల్ కంపెనీని నిర్వహించే రూబెన్ సింగ్ ఇటీవల తాను కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగ్ పోస్ట్ చేసిన రోల్స్ రాయిస్ కలెక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. రోల్స్ రాయిస్ కార్లతో పాటు ఆయనకు బుగాట్టి వెరైన్, పోర్షే 918, సైడర్, పగాని హుయర, లంబోర్గిని హరికేన్, ఫెరారి ఎఫ్ 12, బెర్లినెట్టా పరిమిత ఎడిషన్ (ప్రపంచంలో ఒకే ఒక్క వాహనం) వంటి పలు లగ్జరీ కార్లున్నాయి. రూబెన్ సింగ్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు చిన్న పరిశ్రమలు, కాంపిటీటివ్ కౌన్సిల్‌పై ప్రభుత్వ సలహామండలిలో సభ్యుడిగా పనిచేశారు. గతంలోనూ బ్రిటన్ ప్రభుత్వంలో ఆయన పలు పదవులు నిర్వహించారు. -
ఈ కారు ధర రూ.11 కోట్లు
చెన్నై: అల్ట్రా–లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్‌రాయిస్’ తాజాగా 8వ జనరేషన్ ఫాంటమ్ కారును భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.9.5 కోట్లగా నిర్ణయించగా.. ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ వేరియంట్ ధరను రూ.11.35 కోట్లగా నిర్ణయించినట్టు రోల్స్ రాయిస్ తెలిపింది. ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ భాగంలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ‘మాకు మంచి భాగస్వామి (కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్) లభించింది. దక్షిణ భారతదేశంలో వ్యాపారం వృద్ధి చెందుతోంది’ అని రోల్స్‌రాయిస్ మోటార్ కార్స్ (ఆసియా–పసిఫిక్) రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన కారు ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్ చెన్నై, హైదరాబాద్‌లో కంపెనీకి అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా రోల్స్రాయిస్కి దక్షిణ భారతదేశంలో ఐదు ఔట్లెట్స్ ఉన్నాయి. 6.75 లీటర్ ఇంజిన్.. ఫాంటమ్–8లో 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ–12 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక ఫాంటమ్ స్టాండర్డ్ వీల్‌బేస్ వేరియంట్ ధర రూ.9.5 కోట్లుగా, ఫాంటమ్ ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ వేరియంట్ ధర రూ.11.35 కోట్లుగా ఉంటుందని తెలిపింది. నాలుగేళ్ల సర్వీస్ ప్యాకేజ్, రీజినల్ వారంటీ వంటివి ఈ ధరలో భాగమేనని పేర్కొంది. -
లగ్జరీ కార్లు రయ్.. రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు బొమ్మలతో ఆడుకోని పిల్లాడుంటాడా? జతిన్ కూడా అలాంటివాడే. కాకపోతే దాన్ని ఆటకే పరిమితం చేయకుండా వ్యాపారంగా మార్చేసుకున్నాడు. ‘లగ్జరీ కారు కొనాలని, కనీసం ఒక్కసారైనా నడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, అందరూ కొనలేరు’ ఈ వ్యత్యాసాన్నే వేదికగా చేసుకొని బిగ్ బాయ్ టాయిస్ (బీబీటీ) ప్రారంభించాడు. ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్లను మాత్రమే విక్రయించడం దీని ప్రత్యేకత. గుర్గావ్లో 35 వేల చదరపు అడగుల్లో దేశంలోనే అతిపెద్ద షోరూమ్ కలిగిన బీబీటీ... త్వరలోనే హైదరాబాద్‌లో స్టూడియో తరహా ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా బీబీటీ ఫౌండర్ అండ్ ఎండీ జతిన్ అహుజా ‘స్టార్టప్ డైరీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. 18 బ్రాండ్లు, 95 లగ్జరీ కార్లు రూ.70 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా 2009లో బిగ్ బాయ్ టాయిజ్.కామ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆస్టిన్ మార్టిన్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, జాగ్వార్, లెక్సస్, ఫోర్డ్, బెంట్లీ, క్రిస్లర్, హమ్మర్, ల్యాండ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్, డీసీ, ఆడి, కాడిలాక్, లాంబోర్గిని, పోర్షే, ఫోక్స్‌వ్యాగన్, వోల్వో వంటి 18 రకాల బ్రాండ్లు, 150 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకుంటాయి. రూ.50 లక్షల్లో జాగ్వార్ ఎక్స్‌జేఎల్, రూ.4 కోట్లలో లాంబొర్గినీ, రోల్స్ రాయిస్ కార్లున్నాయి. జర్మనీ, యూకే వంటి ఆరు దేశాల్లోని కస్టమర్ల నుంచి కార్లు కొని, వాటిని రీమోడల్ చేసి మన దేశంలో విక్రయిస్తుంటాం. ప్రతి కారునూ 151 రకాల చెక్ పాయింట్స్, బీమా, న్యాయ పరమైన అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాకే విక్రయానికి పెడతాం. హైదరాబాద్‌లో 110 కార్లు రయ్..రయ్.. ప్రస్తుతం నెలకు 35 కార్లను విక్రయిస్తున్నాం. ఇండియన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, దినేష్ కార్తీక్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్ వంటి చాలామంది మా కస్టమర్లే. బీబీలో ఎక్కువగా అమ్ముడయ్యే కార్లు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్. గతేడాది రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రూ.270 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఏటా 35 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 38 శాతం. హైదరాబాద్ వాటా 14 శాతం. ఇప్పటివరకు ఇక్కడ నుంచి 110 లగ్జరీ కార్లను కొన్నారు. 2021 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లకి‡్ష్యంచాం. హైదరాబాద్‌లో స్టూడియో షోరూమ్.. ఆన్‌లైన్‌తో పాటూ ఆఫ్‌లైన్‌లో గుర్గావ్, ఢిల్లీల్లో 2 షోరూమ్‌లున్నాయి. దేశంలో అతిపెద్ద లగ్జరీ కార్ల షోరూమ్ 35 వేల చ.అ.ల్లో గుర్గావ్లో ఉంది. దీన్లో 107 కార్ల డిస్ప్లే ఉంటుంది. ఢిల్లీ షోరూమ్ 7 వేల చదరపు అడుగుల్లో ఉంది. ఇందులో 25 కార్ల డిస్ప్లే ఉంటుంది. ఏడాదిలో హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాల్లో ఔట్లెట్లు ఆరంభిస్తాం. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో స్టూడియో తరహా షోరూమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సుమారు 3,500 చదరపు అడుగుల్లో రానున్న ఈ స్టోర్‌లో 10 కార్ల డిస్ప్లే ఉంటుంది. ఒక్కో ఔట్‌లెట్‌పై రూ.20 కోట్ల పెట్టుబడి పెడతాం. వచ్చేనెలలో గుర్గావ్లో రూ.12 కోట్ల పెట్టుబడితో వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తున్నాం. దీన్లో యాక్సెసరీస్‌తో పాటు సర్వీసింగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మా సంస్థలో వంద మంది ఉద్యోగులున్నారు. లగ్జరీ కార్లను కొనలేని కస్టమర్ల కోసం ‘మర్చండైజ్’ పేరిట మరో విభాగం ఉంది. ఇందులో లగ్జరీ కార్ బ్రాండ్ల కీ చెయిన్స్, పర్ఫ్యూమ్స్, స్టిక్కర్లను విక్రయిస్తాం. త్వరలో పెన్నులు, షర్టులు, టీ షర్టులను కూడా అందుబాటులోకి తెస్తాం. -
క్రేజీ నంబర్ 9999
అత్తాపూర్: అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి టీఎస్ 07 ఈఎక్స్ 9999 నంబర్‌పై రూ.5.77 లక్షల ఆదాయం వచ్చింది. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమాని తమ రోల్స్ రాయిస్ కారు కోసం బుధవారం జరిగిన వేలంలో ఈ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. తమ కంపెనీకి చెందిన అన్ని కార్లకు ఇదే నంబర్ ఉండడంతో పెద్ద మొత్తంలో చెల్లించి నంబర్‌ను దక్కించుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.