చెన్నై: అల్ట్రా–లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్‌రాయిస్’ తాజాగా 8వ జనరేషన్ ఫాంటమ్ కారును భారత్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.9.5 కోట్లగా నిర్ణయించగా.. ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ వేరియంట్ ధరను రూ.11.35 కోట్లగా నిర్ణయించినట్టు రోల్స్ రాయిస్ తెలిపింది. ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ భాగంలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ‘మాకు మంచి భాగస్వామి (కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్) లభించింది.
దక్షిణ భారతదేశంలో వ్యాపారం వృద్ధి చెందుతోంది’ అని రోల్స్‌రాయిస్ మోటార్ కార్స్ (ఆసియా–పసిఫిక్) రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన కారు ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్ చెన్నై, హైదరాబాద్‌లో కంపెనీకి అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా రోల్స్‌రాయిస్‌కి దక్షిణ భారతదేశంలో ఐదు ఔట్‌లెట్స్ ఉన్నాయి.
6.75 లీటర్ ఇంజిన్..
ఫాంటమ్–8లో 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్‌డ్ వీ–12 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక ఫాంటమ్ స్టాండర్డ్ వీల్‌బేస్ వేరియంట్ ధర రూ.9.5 కోట్లుగా, ఫాంటమ్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ వేరియంట్ ధర రూ.11.35 కోట్లుగా ఉంటుందని తెలిపింది. నాలుగేళ్ల సర్వీస్ ప్యాకేజ్, రీజినల్ వారంటీ వంటివి ఈ ధరలో భాగమేనని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment