స్టార్ హీరోకు- నిర్మాతకు మధ్య ఓ వివాదం. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన దీనిపై తాజాగా న్యాయాస్థానం తీర్పు ఇచ్చింది. సదరు హీరో.. దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలా హీరో ఎవరు?
జరిగింది ఇదే
తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అప్పట్లో 'వల్లభ, 'మన్మథ' లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత కేవలం తమిళం వరకే పరిమితయ్యాడు. ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల అందుకున్నాడు. కోటి రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం డబ్బుగా ఇచ్చారు.
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?)
ఎందుకు గొడవ?
అయితే అడ్వాన్స్ తీసుకున్న శింబు.. సినిమా చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు.. బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా అవి తిరిగివ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.
క్లారిటీ మిస్
ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి ఏమైనా వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే 'పాతు తలా' మూవీతో వచ్చిన శింబు హిట్ కొట్టాడు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?)
Comments
Please login to add a commentAdd a comment