
సాక్షి, చెన్నై: ఎన్నికల నామినేషన్‌లో ఆస్తుల వివరాలను మాజీ మంత్రి కేసీ వీరమణి దాచిపెట్టడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. వివరణ కోరుతూ ఈసీకి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి కేసీ వీరమణి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోలార్‌పేట నుంచి పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి దేవరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్‌లో ఆస్తుల వివరాలను దాచి పెట్టినట్టు తాజాగా వెలుగు చూసింది. రామమూర్తి అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తుల వివరాలు, ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఆస్తుల వివరాల మధ్య తేడా ఉందని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment