KC veeramani
-
నామినేషన్లో తేలని లెక్క... ఈసీకి కోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: ఎన్నికల నామినేషన్లో ఆస్తుల వివరాలను మాజీ మంత్రి కేసీ వీరమణి దాచిపెట్టడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. వివరణ కోరుతూ ఈసీకి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి కేసీ వీరమణి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోలార్‌పేట నుంచి పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి దేవరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్లో ఆస్తుల వివరాలను దాచి పెట్టినట్టు తాజాగా వెలుగు చూసింది. రామమూర్తి అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తుల వివరాలు, ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఆస్తుల వివరాల మధ్య తేడా ఉందని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. -
శశికళను ఎదుర్కొనేందుకు సిద్ధం
సాక్షి, చెన్నై: బెంగళూరు జైలు నుంచి శశికళ బయటకు వచ్చి సమస్యలు సృష్టించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు కలెక్టరేట్లో శనివారం మంత్రి గ్రామీణ ప్రాంతాలకు రేషన్ వస్తువుల పంపిణీ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ బైకులను అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ఇంటి వద్దకే వస్తువులు అందజేసేందుకు వాహన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. (నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ) షోళింగర్‌లో ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించనున్నామని తెలిపారు. శశికళ బయటకు వస్తారని ఏదో అయిపోతుందని కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా రాస్తున్నారని వీటిని వదిలి పెట్టి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాలపై వార్తలు రాయాలన్నారు. డీఆర్ఓ పారి్థబన్, అన్నాడీఎంకే కార్పొ రేషన్ కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, ఆవిన్ డెయిరీ చైర్మన్ వేలయగన్, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి సన్నిహితుడి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. సోమవారం డీఎంకే నేతకు సంబంధించిన ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించగా.. అట్టపెట్టేల్లో రూ. 20 కోట్లు పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నాడీఎంకే నేత, మంత్రి కేసీ వీరమణి సన్నిహితుడి నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 15 కోట్లు పట్టబడ్డాయి. వీరమణి సన్నిహితుడు, కాంట్రాక్టర్ అయిన సబీశన్ నివాసంలో ఈ సొమ్ము పట్టుబడింది. మంత్రి కేసీ వీరమణికి చెందిన పలు కంపెనీల్లో టీడీపీ నేతలైన రామాంజనేయులు, బ్రహ్మానందం భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతల ద్వారానే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సబీశన్ నివాసంలో ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంకే అధినేత స్టాలిన్ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేయడంతో ఐటీ అధికారులు సంబంధిత వీడియోలు విడుదల చేశారు. -
దినకరన్ దిష్టిబొమ్మ దహనం
వేలూరు: జిల్లా కార్యదర్శి పదవి నుంచి మంత్రి కేసీ.వీరమణిని తొలగించడాన్ని ఖండిస్తూ కార్యకర్తలు టీటీవీ.దినకరన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. జిల్లా కార్యదర్శిగా వీరమణిని తొలగించి ఎమ్మెల్యే బాలసుబ్రమణ్యంను నియమించడంతో దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మాదనూర్, ఆంబూరు, వానియంబాడి,, తిరుపత్తూరు, గుడియాత్తం ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు దినకరన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన చిత్ర పటాలను దహనం చేస్తున్నారు. గురువారం ఉదయం వేలూరు ఎంజీఆర్ మండ్ర జిల్లా కార్యదర్శి నారాయణన్ అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం చేరుకుని దినకరన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దినకరన్ వెంటనే పార్టీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. గుడియాత్తం ఎమ్మెల్యే కార్యాలయానికి తాళం గుడియాత్తం ఎమ్మెల్యే జయంతి పద్మనాభన్ దినకరన్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ గుడియాత్తం పట్టణ కార్యదర్శి పయణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆమె దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు కార్యాలయానికి తాళం వేశారు. -
కోట్లకు అధిపతి కాకూడదా?
నగర కార్యదర్శి, నగర పాలక సంస్థ చైర్పర్సన్లు వంద కోట్ల మేరకు ఆస్తి కలిగి ఉంటే తమ అధినేత్రి జయలలిత కోట్లకు అధిపతి ఎందుకు కాకూడదంటూ మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అవినీతి తాండవం చేస్తోందని, ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకంగా మంత్రులు ఏ మేరకు అక్రమార్జన సాగిస్తున్నారో చిట్టాలను సైతం ప్రకటిస్తూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు అయితే ఫలాన అధికార పక్షం నేతకు వద్ద ఇన్ని కోట్లు ఉన్నాయని, ఫలాన నేత ఈ నాలుగేళ్లలో ఇన్ని కోట్లు సంపాదించాడని ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యత కల్గిన పద విలో ఉన్న మంత్రి ఏకంగా ప్రతిపక్షాల ఆరోపణల్ని సమర్థించే రీతిలో కోట్లు, అధిపతి అంటూ ప్రస్తావించడం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. గుడియాత్తంలో అన్నాడీఎంకే సర్కారు నాలుగున్నరేళ్ల ప్రగతిని చాటుతూ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గుడియాత్తం నగర కార్యదర్శి జెకేఎన్ పళని నేతృత్వంలో అక్కడి బస్టాండ్ ఆవరణలో సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ హాజరయ్యారు. కేసీ వీరమణి మాట్లాడుతూ గుడియాత్తం నగర పార్టీ కార్యదర్శి జేకే ఎన్ పళని, నగర చైర్ పర్సన్ అముదాలు వంద కోట్ల ఆస్తిపరులుగా పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్యదర్శి, చైర్పర్సన్లే వంద కోట్ల ఆస్తి పరులుగా ఉంటే తమ అధినేత్రి, అమ్మ జె జయలలిత కోట్లకు అధిపతిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఇంతలో నాంజిల్ సంపత్ అందుకుని వంద కోట్ల ఆస్తి పరుడు ఇక్కడ కార్యదర్శిగా పార్టీకి సేవల్ని అందించడం బట్టి చూస్తే ఏ మేరకు వారు దోపిడీకి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిం చాయి. ఈ వ్యాఖ్యలపై అమ్మ ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో అతనిపై చర్యలు తప్పవని అంటున్నారు.