affidavits
-
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
గన్స్ & కార్స్
సాక్షి, హైదరాబాద్: సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు. ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు .22 పిస్టల్ వారసత్వంగా రాగా.. యాకుత్‌పుర బరిలో ఉన్న జాఫర్ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్నగర్ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి టెక్సాస్ నుంచి టెస్లా, ల్యాండ్ రోవర్ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు. విదేశాల నుంచి గన్స్ దిగుమతి.. యాకుత్‌పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ మిరాజ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్ బ్రాండ్ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్ రివాల్వర్, .32 పిస్టల్ రాఫ్టర్ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్ కూడా ఉంది. మలక్‌పేట అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్ గన్లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ వాహనాలున్నాయి. బలాలకు షహనాజ్ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్వీ, టొయోటా ఫార్చ్యూనర్ కార్లున్నాయి. హరీశ్ వర్సెస్ రేవంత్.. రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్ ఉన్నాయి. రేవంత్ పేరు మీద సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్‌తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. ఎస్బీబీఎల్ పంప్ యాక్షన్ గన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్ సింగిల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (ఎస్బీబీఎల్) పంప్ యాక్షన్ గన్ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్‌సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్‌తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్ ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీ నుంచి.. గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి. ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్‌గా భావించే .22 పిస్టల్ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు. 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్ డబుల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (డీబీబీఎల్) గన్ కూడా ఉంది. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ కూడా అక్బరుద్దీన్ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్ఎక్స్ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. స్పోర్ట్స్ కారులో అజార్, టెస్లాలో శ్రీలత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్–వీ కార్లున్నాయి. హుజూర్నగర్ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి. రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి వద్ద 2021 మోడల్ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్ ల్యాండ్ రోవర్ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
ఎమ్మెల్యేగా గెలిచినా..ఓడిపోతారు!
వనమా వెంకటేశ్వరరావు.. 2018లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని, కొన్నిచోట్ల ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని జలగం వెంకట్రావు హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినన్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. 2018లో గద్వాల్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.2.5 లక్షల జరిమానా కూడా విధించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆదేశించింది ఆ అభ్యర్థులిద్దరూ శాసనసభ్యులుగా విజయం సాధించిన వారే. ప్రజాఓటుతో గెలిచిన వారే. వారికి వచ్చిన ఓట్లను కోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. కానీ, అఫిడవిట్లో అన్ని అంశాలూ పేర్కొనలేదని, కొన్ని తప్పులుగా పేర్కొన్నారన్న కారణంగా వారిపై వేటు వేసింది. వారి తర్వాత రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు విజయం కట్టబెడుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఇలా ఈ రెండు పిటిషన్లే కాదు.. దాదాపు 30 వరకు పిటిషన్లు హైకోర్టులో నమోదయ్యాయి. వనమా, బండ్ల, శ్రీనివాస్‌గౌడ్ కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఇతర పిటిషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ ఒకసారి కంటే ఎక్కువసార్లు పోటీ చేస్తున్న అభ్యర్థులైతే గతంలో వేసిన అఫిడవిట్‌తో ఈసారిఅఫిడవిట్ను సరిచూసుకోవాలి. ♦ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కేసులున్నాయో.. లేదో..తెలుసుకోవాలి. ♦ సొంత ఆస్తులేకాదు.. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఇది స్థిర, చర ఆస్తులకు కూడా వర్తిస్తుంది. ♦ కంపెనీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు తదితర వివరాలను పొందుపర్చాలి ♦ ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, రుణాలు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం వివరాలను స్పష్టంగా పేర్కొనాలి ♦ మోటారు వాహనాలు, నగలు, బులియన్, ఇతర విలువైన వస్తువులు తూకంతో సహా వెల్లడించాలి 2018 ఎన్నికల తర్వాత 30కిపైగా పిటిషన్లు.. తప్పుడు అఫిడవిట్ల కారణంగా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలా ఒకటి రెండేళ్లు కాదు.. ఏళ్ల కొద్దీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఏ మాత్రం తప్పని తేలినా వేటు పడక తప్పదు. తీర్పు వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు. 2018 ఎన్నికలే కాదు... గతంలోనూ ఇలా కులం, ఆస్తుల విషయంలో కోర్టు చుట్టూ తిరిగిన వారున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైకోర్టులో 30కుపైగా పిటిషన్లు దాఖలు కాగా.. అందులో 25కుపైగా పిటిషన్లు ఒకే పార్టీకి చెందిన నేతలపై దాఖలయ్యాయి. పలువురు మంత్రులపై కూడా ఎన్నికల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్‌పై తీర్పు రాగా.. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఎన్నికపై వివాదం నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. స్టే తెచ్చుకున్నారు. ఇక చెన్నమనేని రమేశ్, మర్రి జనార్దన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై హైకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి. అన్నీ సరిచూసుకుని వివరాలివ్వాలి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న వెలువడనుంది. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నారు. వారి స్థిర, చర ఆస్తులు, అప్పుల అఫిడవిట్లు అందజేస్తారు. ఈ అఫిడవిట్ల సమర్పించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ తెలిపింది. కేసులు, తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు.. ఇలా అన్ని అంశాలను సరి చూసుకుని అఫిడవిట్ అందజేయాలి. లేదంటే తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తోంది. గత 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారంటూ పదుల సంఖ్యలో కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే దాఖలు చేసిన ఈ కేసులు ఇప్పటికి కొన్ని పూర్తవ్వగా, ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని అంశాలను పరిశీలించి అఫిడవిట్ వేయకుంటే శాసనసభ్యుడిగా గెలిచినా.. వేటు పడే అవకాశం ఉంది. - గండ్రాతి అరవింద్‌రెడ్డి -
ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) తేలి్చంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. -
ఓటర్లకు అఫిడవిట్ కాపీలు; కేజ్రీవాల్ వెరైటీ ప్రచారం
పణజి: విలక్షణ ఆలోచనలు, విభిన్న పోకడలతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. గోవా మెరుగైన భవిష్యత్తు కోసం తమ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలను ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ‘బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు ఆప్‌లో చేరేందుకు తమ పార్టీలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు, గోవా భవిష్యత్తు కోసం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయండి. దయచేసి ఈసారికి మీ పార్టీని మరచిపోండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నిజాయితీగా పనిచేస్తామని ‘ఆప్’ అభ్యర్థులతో అఫిడవిట్లపై సంతకాలు చేయించారు కేజ్రీవాల్. అంతేకాదు గెలిచిన తర్వాత పార్టీ ఫిరాంచబోమని, ‘ఆప్’నకు విశ్వాసపాత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ సమక్షంలో గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... చెల్లెలి అలుపెరుగని పోరాటం) ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులందరూ నిజాయితీపరులే. అయితే వీరంతా నిజాయితీపరులని ఓటర్లు నిర్ధారించేందుకు ఈ అఫిడవిట్లు అవసరం. మా అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంతకం చేసిన అఫిడవిట్ కాపీని పంపిణీ చేస్తారు. అలా చేయడం ద్వారా, మా అభ్యర్థులు అఫిడవిట్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై విశ్వాస ఉల్లంఘన దావా వేసే అధికారాన్ని మేము ఓటర్లకు అందిస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేపథ్యాలను పరిశీలించేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతి ఉంది. గోవా ప్రజల నమ్మకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ వమ్ము చేయద’ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. (చదవండి: బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి) -
నామినేషన్లో తేలని లెక్క... ఈసీకి కోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: ఎన్నికల నామినేషన్లో ఆస్తుల వివరాలను మాజీ మంత్రి కేసీ వీరమణి దాచిపెట్టడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. వివరణ కోరుతూ ఈసీకి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి కేసీ వీరమణి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోలార్‌పేట నుంచి పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి దేవరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్లో ఆస్తుల వివరాలను దాచి పెట్టినట్టు తాజాగా వెలుగు చూసింది. రామమూర్తి అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తుల వివరాలు, ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఆస్తుల వివరాల మధ్య తేడా ఉందని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. -
తుపాకులు, పుస్తకాలు..పెయింటింగ్స్
రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పలువురు అభ్యర్థులు తుపాకులు, లగ్జరీ కార్లు, పెయింటింగులు, పుస్తకాలే తమ ఆస్తులుగా చూపిం చారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన దగ్గర 15 తుపాకులు ఉన్నాయని, వాటి విలువ 9 లక్షల రూపాయలని పేర్కొన్నారు. రాథోడ్ పేరొందిన షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఈ తుపాకుల్లో పది తనకు బహుమానంగా వచ్చాయని ఆయన అఫిడవిట్లో వివరించారు. జల్వార్–బరన్ నుంచి పోటీలో దిగిన దుష్యంత్ సింగ్ తనకు ఐదు రోల్స్‌రాయస్ కార్లు ఉన్నాయని పేర్కొంటే, అజ్మీర్ కాంగ్రెస్ అభ్యర్థి రిజు ఝన్‌ఝన్‌వాలా 16 లక్షల రూపాయల విలువైన కళాఖండాలను తన ఆస్తులుగా అఫిడవిట్లో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్‌సమంద్ నుంచి పోటీ చేస్తున్న జైపూర్ యువరాణి దియా కుమారి తనకు 64.89 లక్షల రూపాయల విలువైన నగలున్నాయని తెలిపారు. ఇక కోటా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న రాం నారాయణ్ మీనా దగ్గర 25,500 రూపాయల విలువైన పుస్తకాలు ఉన్నాయట. -
టీడీపీ అభ్యర్థుల అఫిడవిట్లపై ఫిర్యాదులు
-
అఫిడవిట్ రూపంలో వాగ్దానాలు
ఎన్నికల హోరు ముగి సింది. పోటీలో వాగ్దానాల జడివాన గుర్తులు కూడా ఇక కనిపించవు. ఆ వాగ్దానాలు గెలిచిన పార్టీ చేసినవే అయినా, ఓడిన పార్టీ చేసినవయినా, లేక గెలిచిన అభ్యర్థి లేదా ఓడిన అభ్యర్థి చేసిన వాగ్దానాలయినా సరే వాటికి విలువ ఉండాలి కదా. రాజకీయ పార్టీలు కొన్ని వాగ్దానాలు చేస్తాయి. అభ్యర్థులు కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలోకి జంప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎంత అవినీతికరమైన పనో చెప్పలేం. కనీసం ఫిరాయింపు నిషేధ చట్టం ప్రయోగించడానికి కూడా రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదు. పదవుల ఆశ చూపి ఫిరాయింపులు చేయడం ఎందుకు అవినీతికరమైన నేరం కాదో ఆ నాయకులు చెప్పాలి. పదవికోసం తనను నిలబెట్టిన పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేశారో వారే వివరణ ఇచ్చుకోవాలి. ఫిరాయించినా, ఫిరాయించకపోయినా ప్రజాప్రతినిధులకు తమను ఎన్నుకున్న ఓటర్ల పట్ల బాధ్యత ఉంటుందని మరవడానికినీ వీల్లేదు. నిజానికి వాగ్దానాలు చేసి ఓడిన అభ్యర్థి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉండదలచుకుంటే, మరోసారి బరిలో నిలబడదలచుకుంటే అయిదేళ్లపాటు నియోజకవర్గంలో ఉండి సేవలు చేసి ప్రజాభిమానం చూరగొనాలి. అంతేకాదు. తను ఏ సేవలు చేస్తానని వాగ్దానం చేశాడో, ఆ సేవలు వారికి అందించడానికి ఒక నాగరికుడిగా, నాయకుడిగా కృషి చేయాలి. ఈ ఎన్నికల పోరాటంలో మూడింట రెండువంతుల స్థానాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రసమితి కొత్త తెలంగాణ రాష్ట్రానికి రెండో ప్రభుత్వాన్ని ఇవ్వబోతున్నది. చేసిన వాగ్దానాలన్నింటినీ అమలుచేసి తీరతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్ష స్థానాలకు పరిమితమైన కూటమి కూడా తమ వాగ్దానాలలో అధికార పార్టీ చేసిన వాగ్దానాలతో సమానమైనవి ఏవైనా ఉంటే వాటి అమలుకు కృషి చేయవలసి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. శాసనసభకు పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి సమాచారం దేశం మొత్తానికి తెలియజేయాలి. శాసనసభ ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. మొత్తం రాష్ట్రానికి చెందినది. కనుక అందులో సభ్యులుగా ఉండదలచుకున్న వారి నేర చరిత్ర, ఆర్థిక స్థాయి, చదువు సంధ్యల గురించి ప్రతి ఓటరుకు, ప్రతి పౌరుడికీ తెలియవలసిందే అని 2002లో సుప్రీంకోర్టు నిర్దేశిం చింది. ప్రతి అభ్యర్థితో ఈ సమాచారం ఇప్పించేం దుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలని సూచించింది. కానీ అందరూ కలిసి అప్పటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం ద్వారా సవరణ చట్టం తెచ్చి, సుప్రీంకోర్టు ఏమి చెప్పినా సరే ఆ సమాచారం ఇవ్వనవసరం లేదన్నారు. మళ్లీ సుప్రీంకోర్టు ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని కొట్టి వేసింది. అప్పటినుంచి పౌరులందరికీ ఈ సమాచారం ఒక హక్కుగా లభిస్తున్నది. కానీ పౌరుల బాధ్యత ఏమిటి? పార్టీల బాధ్యత ఏమిటి? పార్టీలయితే నేరగాళ్లను ఎన్నికలలో నిలబెట్టకూడదు. ఒకవేళ నిలబెట్టినా జనం వారికి ఓట్లేయకూడదు. ఈ నేరగాళ్లు చేసిన వాగ్దానాలను ఓటర్లు నమ్మాలా? లేక ఈ నేరగాళ్లను నిలబెట్టిన పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మాలా? వారికే ఓటు వేయాలా? ఇదే జనం ముందున్న సంది గ్ధత. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ నేరచరితులే అయితే, వారిమీద కేసులు ఇంకా నడుస్తూ ఉండి ఉంటే వారికే ఓటు వేయడం న్యాయమా? నోటా మీట నొక్కవలసిందేనా? అప్పుడు నోటానే గెలిస్తే ఏమవుతుంది? మళ్లీ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే మళ్లీ వీళ్లే పోటీ చేస్తే ఏం చేయాలి? చేసిన వాగ్దానాలను నెరవేర్చారా లేదా? అనే సమాచారం కూడా ఈ నేతలు ఇవ్వాలి. సొంతంగా తామే ఇవ్వాలి. అదీ అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. నేను లేదా నా పార్టీ గతసారి ఎన్నికల్లో ఈ వాగ్దానాలు చేశాం అని ఒక కాలంలో రాసి, దాని పక్క కాలంలో అమలు చేశాను లేదా చేయలేదు అని కూడా రాయాలి. ఒకవేళ వాగ్దానాలు అమలు చేయకపోతే ఆ విషయం కూడా జనానికి తెలియజేయాలి. ఎన్నికల కమిషన్ అధికారులు దీన్ని పరిశీలించి అమలు చేసిన, చేయని హామీల వివరాలు జనానికి తెలియజేయాలి. ఈ మార్పు వల్ల వాగ్దానాల అమలు ప్రాతిపదిక మీద ఓటర్లకు ఓటు వేసే అవకాశం, అధికారం ఏర్పడుతుంది. అభ్యర్థులు కూడా వాగ్దానాలు అమలు చేతగాక పోతే. మళ్లీ పోటీ చేయడానికి సిగ్గు పడే స్థితి వస్తుంది. పార్టీ వాగ్దానాలను లెక్క గట్టి అమలుకానివి ఎత్తి చూపి, ఇదీ వీరి స్థితి అని నిలదీసి ఓడించే అవకాశం వస్తుంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ఈ-మెయిల్: professorsridhar@gmail.com -
ఠాకూర్, షిర్కే అఫిడవిట్లు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లోధా కమిటీ ముందు తమ అఫిడవిట్లు దాఖలు చేశారు. కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో తమకు ఇబ్బందులు ఉన్నాయంటూ తన పాత మాటలనే ఠాకూర్ ఈ అఫిడవిట్లోనూ పొందుపరిచారు. -
సృతి, కపిల్ సిబల్ ల డాక్యుమెంట్లు లేవు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ 2004 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ లు, డాక్యుమెంట్లు కనిపించడం లేదని ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. వీరిరువురు 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఛాందినీ చౌక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను, సమాచారాన్ని తమవెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వెల్లడించింది. సృతి విద్యార్హతలు అసలైనవి కావని వాటిని పరిశీలించాలని కోర్టులో అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు కేసును అగస్టు 27 కు కేసును వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే సీటు చాలా ‘హాటు’
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు గత ఐదేళ్లో 164 శాతం పెరిగినట్లు వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది. మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 216 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను రెండు స్వచ్ఛంద సంస్థలు అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించాయి. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు 2009లో సగటు రూ.4.97 కోట్లు ఉండగా, అవి ఈ ఏడాదికి రూ.13.15 కోట్లకు పెరిగినట్లు వారి అఫిడవిట్లను విశ్లేషించిన ఆ సంస్థలు తెలిపాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ అధ్యయనం జరిపాయి. ఒక్కో అభ్యర్థి ఆస్తులు సగటున రూ.8.17 కోట్లు లేదా 164 శాతం మేరకు పెరిగినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. ఆస్తుల పెరుగుదలలో మలబార్ హిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అభ్యర్థి మంగళ్ ప్రభాత్ లోధా మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తి 129.97 కోట్లకు పెరిగింది. 2009లో లోధా ఆస్తుల విలువ రూ.68.64 కోట్లు కాగా అవి ఈ ఏడాదికి రూ.198.61 కోట్లకు పెరిగాయి. జల్గావ్ సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన అభ్యర్థి సురేష్ కుమార్ భికమ్చంద్ జైన్ ఆస్తులు ఐదేళ్లలో వందకోట్లు పెరిగాయి. ఐదేళ్ల క్రితం ఆయన ఆస్తుల రూ.82.82 కోట్లు కాగా, ఇప్పుడు అవి రూ.182.84 కోట్లు. కాండీవలి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సింగ్ రామ్‌నారాయణ్ ఠాకూర్ ఆస్తులు రూ.22.22 నుంచి రూ.81.63 కోట్లు అనగా రూ.59.40 కోట్లు పెరిగాయి. కాంగ్రెస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న 62 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 184 శాతం పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఎన్సీపీకి చెందిన 51 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 176 శాతం పెరిగాయి. బీజేపీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులు సగటున 198 శాతం పెరిగినట్లు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఆస్తులు 294 శాతం పెరగగా, ఎనిమిది మంది ఇండిపెండెంట్ సభ్యుల ఆస్తులు 74 శాతం మేరకు పెరిగాయి. శివసేనకు చెందిన 36 మంది శాసనసభ్యుల ఆస్తులు 172 శాతం పెరిగినట్లు వెల్లడైంది. -
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
-
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి శశిధర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా పూరించి దాఖలు చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప లోక్‌సభ స్థానానికి కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టరేట్లోనే నామినేషన్లు వేయాలన్నారు. ఒకవేళ ఆర్వో అందుబాటులో లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన డీఆర్వో వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్కడి ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. రాజంపేట లోక్‌సభకు నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులు చిత్తూరుకు వెళ్లి ఆర్వో అయిన అక్కడి జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలైన 13, 14, 18 తేదీలలో నామినేషన్లు స్వీకరించబోరని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీన స్క్రూటినీ, 23న ఉపసంహరణ ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు లేని రాజకీయ పార్టీ అభ్యర్థికి పదిమంది బలపరచాల్సి ఉంటందని పేర్కొన్నారు. ఆర్వో గదిలోకి అభ్యర్థితోసహా ఐదు మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆర్వో గదికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఒక్కో వాహనంలో ఐదు మందికి మించకూడదన్నారు. నామినేషన్లు ముగిసే వరకు కలెక్టరేట్‌లోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను మాత్రమే దాఖలుచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు వేసేందుకు అర్హత ఉంటుందని చెప్పారు. లోక్‌సభకు నామినేషన్ ఫీజు కింద రూ. 25 వేలు, అసెంబ్లీకి రూ. 10 వేలు చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మినహాయిం ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్బంగా సమర్పించే ఫారం-26 (అఫిడవిట్లో) ఖాళీలు వదలరాదన్నారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది నిజమని రుజువైతే చర్యలు తప్పవన్నారు. అఫిడవిట్లను ఆర్వో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తామని సీఈఓ వెబ్సైట్లో ఉంచుతామని, మీడియాకు ఉచితంగా అందజేస్తామని వివరించారు. అఫిడవిట్లలో ఖాళీలు వదిలితే అభ్యర్థికి నోటీసు జారీ చేస్తామని, ఆ అభ్యర్థి మళ్లీ నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసేందుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంకు అకౌంటును తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, కాకపోతే ఓటున్న నియోజకవర్గం నుంచి సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థికి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా పొందుపరచాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద 50 వేల రూపాయల కంటేఎక్కువ ఉంటే సీజ్ చేస్తామన్నారు. ముగ్గురు వ్యయ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నారని, వ్యయ నివేదికలను అభ్యర్థులు సక్రమంగా సమర్పించాలన్నారు. ప్రతి అభ్యర్థికి తాము షాడో రిజిష్టర్లను నిర్వహిస్తామన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, పోలింగ్ రోజున ఓటరు కుడి చూపుడు వేలుకు ఇంకు గుర్తు వేస్తారని తెలిపారు. స్లిప్పులు లేకపోయినా ఈసీ సూచించిన 24 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపెట్టినా ఓటు వేయడానికి అనుమతిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 560 ర్యాంప్స్, టాయిలెట్స్, తాగునీరు, షామియానా వంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ల సమయంలో తమ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల వలే డిక్లరేషన్ సరిపోదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఒకరు మాత్రమే జనరల్ ఏజెంటుగా ఉంటారని, ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్న వారిని జనరల్ ఏజెంటుగా అనుమతించబోమన్నారు. -
అఫీడవిట్లతో టీడీపీ నేతల్లో గుబులు