న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లోధా కమిటీ ముందు తమ అఫిడవిట్లు దాఖలు చేశారు. కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో తమకు ఇబ్బందులు ఉన్నాయంటూ తన పాత మాటలనే ఠాకూర్ ఈ అఫిడవిట్‌లోనూ పొందుపరిచారు.