
తమిళసినిమా: నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం రుద్రన్. ఫైవ్‌స్టార్ కదిరేశన్ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్ర విడుదలను నిషేధించాలని చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులను పొందిన రేవంశు గ్లోబల్ వెంచర్స్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.
అందులో రుద్రం చిత్ర నిర్మాత హిందీ అనువాద హక్కుల కోసం మరో రూ.4 కోట్లు అదనంగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీజేషన్ విచారించిన న్యాయస్థానం చిత్రాన్ని ఈ నెల 24 వరకు విడుదల చేయాలంటూ తాత్కాలిక స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రుద్రన్ చిత్రం విడుదలపై స్టేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ చిత్రం ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment