
చెన్నై : దేశంలో కరోనా కేసులు పెరగడానికి తాము కారణం కాదని కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. గత సోమవారం ఎఐఎడీఎంకే అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నిబంధనల్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు.
ఈ క్రమంలో, ఆ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కోర్డుకు వివరణ ఇచ్చింది. దేశంలో కరోనా కేసుల పెరగడానికి ఈసీని తప్పు బట్టడం సరికాదని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌పై హత్యానేరం కేసు పెట్టాలన్న కామెంట్స్‌ను.. పలు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment