
Vijay Rolls Royce Car Case: నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా విజయ్ లండన్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్‌రాయ్ కారుకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదంటూ వాణిజ్య పన్నుల శాఖ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం విజయ్‌కు రూ.లక్ష అపరాధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ విజయ్ మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అందులో తను ఎంట్రీ ట్యాక్స్ చెల్లించడానికి సిద్ధమని, అయితే అపరాధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ్ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. విజయ్‌కు జరిమానా విధించిన ఉత్తర్వులపై కోర్టు తాత్కాలిక స్టే విధించి అతని పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదులివ్వాలని కోర్టు ఆదేశించింది.