సాక్షి,న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు హరీష్ రావు సూచించారు.
మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక..ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. మద్యం పాలసీలో రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో..రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment