![Latest Update On BRS MLC Kavitha Bail Petition In Supreme Court](/styles/webp/s3/article_images/2024/08/12/kavitha_1_0.jpg.webp?itok=RNDBilIP)
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు.
కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది.
Supreme Court issues notice to CBI and ED on BRS leader K Kavitha's plea seeking bail in the excise policy case. pic.twitter.com/GmKe5CjgCy
— ANI (@ANI) August 12, 2024
గతవారం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ (ఆగస్ట్12) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
![](/sites/default/files/inline-images/40_4.png)
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసో డియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.
కాగా, తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టేశారు.
ఈ కేసులోని 50 మంది నిందితుల్లో ఉన్న ఏకైక మహిళ అని, తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించింది. ఆమె నాటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment