న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టులో కవితకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆమె మంగళవారం(ఆగస్ట్27) తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.
దాదాపూ 165 రోజులు జైలులో ఉన్న ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో కవిత తీహార్ జైలు నుంచి విడుదల కావడం సుగమమైంది.
#WATCH | Delhi: Supreme Court grants bail to BRS leader K Kavitha in the excise policy irregularities case.
BRS MP Ravi Chandra says, "Today is a very good day for us...A wrong case was filed against her and they have no proof against her...Our party believes in judiciary and… pic.twitter.com/d0UjoFQ8Fn— ANI (@ANI) August 27, 2024
తీహార్ జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టుకు కవిత భర్త అని ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ వారెంట్‌తో తీహార్ జైలుకు కవిత తరుఫు న్యాయవాదులు వెళ్లారు. తీహార్ జైల్లో కవితను విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలను సమర్పించారు.
కాగా, మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ కేసు విచారణ కొనసాగుతుండగానే అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు.
తీహార్ జైలు వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు
తీహార్ జైలు నుంచి విడుదలతో కవితను పరామర్శించేందుకు తిహార్ జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment