
హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. మంగళవారం సుప్రీం కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై కవిత సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Thank You Supreme Court 🙏
Relieved. Justice prevailed— KTR (@KTRBRS) August 27, 2024
రాత్రికి ఢిల్లీలోనే.. రేపే హైదరాబాద్‌కు కవిత రాక
మరోవైపు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఆమె తరుఫు లాయర్లు ప్రారంభించారు. ట్రయల్ కోర్టుకు షూరిటీ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జైలు సమయానికి ఈ ప్రక్రియ పూర్తయితే సాయంత్రమే కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలైతే కవిత రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఢిల్లీ నుంచి కేటీఆర్,హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్‌కు రానున్నారు.