కేసీఆర్‌ బిడ్డ తప్పు చేయదు : కవిత | kavitha speech after release tihar jail | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బిడ్డ తప్పు చేయదు : కవిత

Published Tue, Aug 27 2024 9:19 PM | Last Updated on Wed, Aug 28 2024 9:55 AM

kavitha speech after release tihar jail

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు భర్త, కుమారుడు ,బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌,హరీష్‌ రావుతో  పాటు పలు సీనియర్‌ నేతలు తీహార్‌ జైలు బయట స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులను చూసిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్‌ బిడ్డను. కేసీఆర్‌ బిడ్డ ఎలాంటి తప్పు చేయదు. తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ కవిత భావోద్వేగానికి గురయ్యారు.

 

చాలా రోజుల తర్వాత మీ అందరిని కలవడం సంతోషం. 18 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నా. నేను మొండిదాన్ని.. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండిదాన్ని చేశారు.  ఒక తల్లిగా ఐదున్న నెలల పిల్ల‍ల్ని వదిలి ఉండటం చాలా బాధాకరం. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉండడం ఇబ్బందికరమైన విషయం. నన్ను,నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆ సమయం అతి త్వరలోనే రాబోతుంది. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తాం’ అని కవిత అన్నారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement