
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
ఈడీ రిపోర్టులో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు.

రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పినట్లు ఈడీ తెలిపిందన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment