సాక్షి,న్యూఢిల్లీ : రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో నడిచిన హైడ్రామా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసులో తమ పార్టీ అధినేతకు (కేజ్రీవాల్) సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బయపడిపోతుందంటూ ఎక్స్ వేదికగా స్పందించింది.
లిక్కర్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా నడిచింది. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. అనంతరం బుధవారం కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్‌ను తమకు ఐదురోజుల పాటు కస్టడీ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీ అమితాబ్ రావత్ అరెస్ట్ ఆర్డర్‌ను పాస్ చేయడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.
ఈ వరుస పరిణామలపై ఆప్ స్పందించింది. ట్రయిల్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణకు రాకముందే ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆప్ మండిపడింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బీజేపీకి బయపట్టుకుంది. అందుకే సీబీఐ కోర్టులో అక్రమంగా అరెస్ట్ చేసిందని ట్వీట్‌లో పేర్కొంది.
‘నియంత క్రూరత్వం అన్ని హద్దులు దాటింది.ఈ రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ తీవ్ర భయాందోళనకు గురైంది.సీబీఐతో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించింది’అని ట్వీట్‌లో ద్వజమెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment