శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పేదలకు మద్యపానం ఓ వ్యసనమని, శారీరక శ్రమ చేసిన తర్వాత రెండు పెగ్గులు వేసుకునేవారికి గత ప్రభుత్వం మద్యం లభించకుండా చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మడంతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం పెరిగిందన్నారు. తగ్గిన ఆదాయం నాటి నాయకుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. 2019–24 మద్యం అమ్మకాలపై సీఎం చంద్రబాబు బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. గత పాలకులు మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందని ఆరోపించారు.
4,380 మద్యం షాపులను 2,934కి తగ్గించి మళ్లీ ఏపీ టీడీసీ టూరిజం పేరుతో దుకాణాల సంఖ్యను 3,392కి పెంచారన్నారు. 2019లో ఉన్న 840 బార్లను అలాగే కొనసాగించారన్నారు. దీనివల్ల అక్రమ రవాణా పెరిగిందన్నారు. 2014–19లో ఏపీకి, తెలంగాణకు మద్యం ఆదాయంలో వ్యత్యాసం రూ.4,186.70 కోట్లు ఉంటే 2019–24లో ఏకంగా రూ. 42,762 కోట్లకు చేరడంతో 10 రెట్ల ఆదాయం ఏపీకి తగ్గిపోయిందన్నారు. మ ద్యం పాలసీలో వ్యత్యాసం వల్ల ఆదాయంలో తెలంగాణ ముందుందన్నారు.
అన్ని వ్య యాలు పోనూ ఐదేళ్లలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.18,860 కోట్ల ఆదాయం తగ్గిపోయిందన్నారు. ఇతర రాష్ట్రాలు లాభపడితే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు. పేదవాడు తాగే లిక్కర్ రేట్లు పెంచి 99.97 శాతం బ్రాండ్లు లేకుండా చేశారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో లిక్కర్ కేసుకు రూ.200, బీరు కేసుకు రూ.50 చొప్పున అక్రమంగా వసూలు చేశారని, 2019–24 మధ్య రూ. 3,113 కోట్లు అక్రమంగా వసూలు చేశారని
ఆరోపించారు.
ధరలు తగ్గిస్తాం.. సీఐడీ, ఈడీతో దర్యాప్తు
ఆబ్కారీ శాఖను ఒకే తాటిపైకి తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మద్యం ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీబీసీఐడీ, ఈడీతో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు.
మానవీయ కోణంలో పనిచేయండి
అధికారులు రూల్స్ అనే కోణంలో పని చేయకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యారోక్రటిక్ కోణం కాకుండా మానవీయ కోణంతో పనిచేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. రూ. లక్ష కోట్ల వరకు బిల్లులు, బకాయిలు ఉన్నా యన్నారు. రాయలసీమలో ఇండ్రస్టియల్ కారిడార్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు.
రేపు ఢిల్లీకి బాబు
చంద్రబాబు శుక్రవారం (రేపు) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సముచిత స్థానం ఇచ్చారని భావిస్తున్న ఆ యన అందుకు ప్రధాని ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వెళు తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, సీఎం చంద్రబాబుతో బుధవారం ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, అక్కడి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని చంద్రబాబు ఆయన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment