పట్నా: గత కొంతకాలంగా బీహార్‌లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్‌పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.
ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి
Comments
Please login to add a commentAdd a comment