మూడు రోజుల సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్‌ | Arvind Kejriwal sent to 3 day CBI custody | Sakshi
Sakshi News home page

మూడు రోజుల సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్‌

Jun 26 2024 7:48 PM | Updated on Jun 26 2024 8:15 PM

Arvind Kejriwal sent to 3 day CBI custody

సాక్షి,ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అడిగిన ఐదురోజుల కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చింది.

అంతేకాదు సీబీఐ మూడు రోజుల కస్టడీ సమయంలో కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, అతని లాయర్‌కు ప్రతి రోజు 30 నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది.

దీంతో పాటు కేజ్రీవాల్‌ సూచించిన మందులు, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని అందించేందుకు  కూడా కోర్టు వారికి అనుమతించింది.

కాగా, లిక్కర్‌ మద్యం పాలసీ కేసులో మంగళవారం తీహార్‌ జైల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. బుధవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరించింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేసేందుకు కస్టడీ తీసుకునేందుకు అనుమతి కావాలని కోర్టులో ధరఖాస్తు చేసుకుంది. 

దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్​ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి అనుమతించింది. ఈ మేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. పాలసీ కేసులో మరిన్ని వివరాల్ని రాబట్టేందుకు సీబీఐ అడిగిన ఐదురోజుల కస్టడీ కాకుండా మూడురోజులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మూడు రోజుల పాటు కేజ్రీవాల్‌ సీబీఐ కస్టడీలో ఉండనున్నారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement