న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించడం అద్భుతం కంటే తక్కువ కాదు అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ సందర్భంగా ఆప్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. 40 రోజుల్లో మధ్యంతర బెయిల్ పొందడం అద్భుతం కంటే ఎక్కువే. సుప్రీం కోర్టు ద్వారా దేశంలో ఏమి జరిగినా మార్పు అవసరమని దేవుడి సూచనే అని ఆప్ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశం రాజ్యాంగపరమైన ముప్పు తెచ్చే వారికి ఎదురు దెబ్బే అవుతుందని ఆప్ నేతలు గోపాల్ రాయ్, అతిషి, భరద్వాజ్‌లు స్పష్టం చేశారు.
కాగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రత్యర్థులను తప్పుడు కేసులతో వేధించేందుకు దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటోందని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment