ఎలన్ మస్క్ పేరు చెప్పగానే అందరికి టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా.. ఓ కొడుకుగా తల్లి మాట వినాల్సిందే. ఇక్కడ మస్క్ కూడా తన తల్లి మాయే ఆహార నియమాలకు కట్టుబడి ఉంటాడట. అంతేకాదు ఆమె తన 14 మంది మనవళ్లు, మనవరాళ్లు కోసం కూడా కొన్ని ఆహార నియమాలను కూడా రూపొందించిందట. అవి వాళ్లంతా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనట. ఇక మస్క్ తల్లి మాయే ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు.
మాయే మాజీ మోడల్, డైటీషయన్ కూడా. ఆమె ఆహారం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా నోటిలో పెట్టుకునే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు యువతరం చక్కటి ఆరోగ్య కోసం ఎలాంటి పోషకాహార నియామాలు పాటించాలో కూడా వివరించారు. అవేంటో చూద్దామా..!.
76 ఏళ్ల మాయే మస్క్ ఈ వయసులో కూడా ఎంతో అందంగా, చురుకుగా ఉంటారు. ఆమె గత 40 ఏళ్లుగా డైటీషియన్‌కి సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థను కూడా నడుపుతోంది. ఆమె తరుచుగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్యూలో తన హెల్త్ సీక్రెట్‌ని వివరిస్తూ.. ఈనాటి యువతరం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా డైట్‌ని మార్చి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునేలా ప్రయత్నించాలని అంటారు మాయే. అప్పుడు బ్లడ్‌లో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలో మెరుగైన మార్పులు కనిపించడమే గాక చికిత్స ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటారామె.
అలాగే తాను 14 మంది పిల్లలకు నానమ్మగా ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వనని అన్నారు. ముఖ్యంగా చిప్స్, కుక్కీలకు తన ఇంట్లో స్థానం ఉండదంటారు. చక్కెర, సోడియంతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రమాదకరమైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయని నొక్కిచెప్పారు.
తన మనవళ్లు, మనవరాళ్లను అవి తినే విషయంలో తాను చాలా స్ట్రిక్‌గా ఉంటానన్నారు. జంక్‌ఫుడ్‌కి ఎడిక్ట్ అయ్యేలా చేసేవే అవేనని అంటారు మాయే. చిన్నారులు ఒక్కసారి తినే ప్రయత్నం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోలేరు అందువల్లే ముందే వాళ్ల దరిదాపుల్లోకి వాటిని రానీయకూడదంటారామె. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వమని సూచిస్తున్నారు మాయే. అవేంటంటే..
పండ్లు
కూరగాయలు
పెరుగు
పాలు
తృణధాన్యాలు
గోధుమ రొట్టె తదితరాలు..
ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..చిప్స్, కుక్కీలు విపరీతమైన ఉప్పు, చక్కెరతో ఉంటాయి. వీటిని తినడం వల్ల దంత క్షయం, చెడు కొలెస్ట్రాల్, టైప్2 డయాబెటిస్, కేన్సర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి, ఒబెసిటీ తదితర అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
వీటిని సరదాగా ఒక్కసారి చిన్నారులకు అలవాటు చేస్తే వాటి రుచికి ఆటోమెటిక్ మళ్లీ తినాలను కోరిక వారిలో బలంగా పెరుగుతుందని అన్నారు. ఒకరకంగా వారి మెదడు కూడా తెలియకుండా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆదిలోనే వాటిని దరిచేరనీయకుండా చూస్తే ఆరోగ్యవంతంగా పెరుగుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment