Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?
ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.
చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్‌బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.
కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్‌లు, ఫైబర్‌లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.
కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలు
ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది.
బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
షుగర్ బోర్డర్‌లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.
కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది.
నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment