
సాక్షి, గుంటూరు : మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలించి.. వ్యాధి బారినపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అతిసార బాధితులకు వైఎస్ఆర్‌సీపీ చేయూతనిస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు యాభై వేల రుపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలిసి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చాలా కలత చెందారని పేర్కొన్నారు. జగన్ బాధితులను పరామర్శించమని మమల్ని పంపించారని చెప్పారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అతిసార ప్రబలిందని బొత్స సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గోపి రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment