కొండకొరకాంలో డయేరియా విజృంభించిం ది. గ్రామానికి చెందిన 13 మంది రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కేం ద్రాస్పత్రిలో చేరారు.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ :
కొండకొరకాంలో డయేరియా విజృంభించిం ది. గ్రామానికి చెందిన 13 మంది రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కేం ద్రాస్పత్రిలో చేరారు. రోగులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. వీరిలో నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
కుటుంబ సభ్యులందరికీ డయేరియా సోకడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కిలారి పాపయ్యకు గురువారం రాత్రి పది గంటలకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అక్కడకు కొద్ది నిమిషాల్లోనే మిగిలిన వారందరూ వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. రాత్రంతా ఇబ్బందిపడిన వీరు మరుచటి రోజు ఉదయం 108 వాహనంలో ఏరియా ఆస్పత్రిలో చేరా రు. రోగులు కిలారి పాపయ్య(80), కిలారి కృష్ణ (65) , కిలారి వెంకన్న (37), కిలారి లక్ష్మన్న( 28), కిలారి రమణ(25), కిలారి శశికళ( 25), కిలారి సత్యవమ్మ( 60), కిలారి సత్యవతి(20), కిలారి భార్గవ్( 6), కిలారి భాగ్యశ్రీ(7), చైతన్య (4), తరుణ్‌కీర్తి(ఏడాదిన్నర)లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
భయమేసింది
ముందుగా మా నాన్న పాపయ్య వాం తులు, విరేచనాలతో బాధపడ్డాడు. అక్కడకు ఐదు నిమిషాలు తర్వాత కుటుంబ సభ్యులందరం వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డాం. ఏమి జరిగిందో తెలియక భయమేసింది. మరుచటి రోజు ఉదయం గ్రామస్తుల సహకారంతో ఆస్పత్రిలో చేరాం.
- కిలారి వెంకన్న, డయేరియా రోగి
కలుషిత ఆహారమే కారణం
కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం తీసుకోవడం వేల్ల డయేరియా సోకి ఉంటుంది. అందరికీ ఒకేసారి డయేరియా సోకడంతో భయపడ్డారు. వీరందరికీ వైద్యసేవలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది.
- డాక్టర్ సత్యశేఖర్, జనరల్ సర్జన్,
కేంద్రాస్పత్రి