
మృతుడు మహబుబ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: డయేరియాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.5లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురుజాల నియోజక వర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పిల్లలగడ్డలో గురువారం డయేరియాతో చికిత్స పొందుతూ మృతి చెందిన షేక్ మందుల మహబు(72) మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు జానీబాషాను ఓదార్చారు. మహేష్ రెడ్డి మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలో ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని దుస్థితిలో పాలన నడుస్తోందని విమర్శించారు.
తాగునీరు కలుషితమవుతున్నా స్పందించని పాలకుల తీరును ఎండగట్టారు. వారం రోజులుగా డయేరియాతో పజలు మంచానపడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు. ఇటు వంటి మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. ఇటీవల డయేరియాతో బాధపడుతూ మృతి చెందిన షేక్. మస్తాన్‌బీ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు షేక్ సైదావలి, జానీబాబు, గనీ, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment