దాకరాయి(రాజవొమ్మంగి) : రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామం సమీపంలో ‘కోదు ’ ఆదివాసీల తండాకు చెందిన ఓ ఆరేళ్ల బాలిక డయేరియాతో సోమవారం మరణించింది. కొండపోడు చేస్తూ జీవనం సాగిస్తున్న బార్సో, ఆనంద్‌ల కుమార్తె మువ్వల సాయి ఆదివారం సాయంత్రం నుంచి విరేచనాలతో బాధపడి నీరసించింది. ఆస్పత్రికి తీసుకు వెళదామనుకునే లోపే సోమవారం ఉదయం మరణించిందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ పెద్దకుమారుడు భీమరాజు కూడా విరేచనాలతో బాధపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వీరుకాక గ్రామంలో మరికొంత మంది కడుపునొప్పి, ఇతర రుగ్మతలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ గ్రామం మారుమూలన ఉండడం వల్ల సకాలంలో వైద్యం అందించే ఆస్కారం లేకపోయిందని, అందువల్లే బాలిక మరణించిందని స్థానికులు చెబుతున్నారు.
డయేరియాతో గిరిజన బాలిక మృతి
Published Tue, Dec 16 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement