పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని నాగరాజుపేట గ్రామంలో డయేరియా ప్రబలింది. వారం రోజులుగా సుమారు 70 మంది గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్య సహాయం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టారు. నీరు కలుషితం కావడం వల్లే డయేరియా ప్రబలిందని వైద్యులు తెలిపారు.