మండలపరిధిలోని భుజిరంపేట పీర్యతండాలో అతిసారం పంజా విసిరింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిగా, మరో అయిదుగురు అస్వస్థతకు గురయ్యారు
కౌడిపల్లి, న్యూస్‌లైన్: మండలపరిధిలోని భుజిరంపేట పీర్యతండాలో అతిసారం పంజా విసిరింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిగా, మరో అయిదుగురు అస్వస్థతకు గురయ్యారు. పీర్యతండాకు చెందిన అజ్మీరగమ్ని(65) వాంతులు విరోచనాలు కావడంతో శనివారం మృతి చెందింది. అంత్యక్రియలకు మనంతాయపల్లి తండాకు చెందిన ఆమె కూతురు బుజ్జి, అల్లుడు బిల్యనాయక్ మనుమరాలు అఖిల(7) వచ్చారు. కాగా అఖిలకు అదేరోజు నుంచి వాంతులు విరోచనాలు కావడంతో ఆదివారం ఉదయం చికిత్స నిమిత్తం కౌడిపల్లికి వచ్చారు. అక్కడి నుంచి మెదక్ తర లిస్తుండగా మృతి చెందింది.
సోమవారం అఖిల తండ్రికి సైతం వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో అతణ్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతోపాటు అదేతండాకు చెందిన పెంట్యానాయక్, జీవుల, రూప్‌సింగ్, సోని వాంతులు విరోచనాలతో అస్వస్తతకు గురయ్యారు. పెంట్యానాయక్, రూప్‌సింగ్, జీవుల మెదక్ ఆసుసత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా పెంట్యానాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో నీమ్స్‌కు తరలించారు. తండాలో బోరునీరు కలుషితం కావడంవల్లే అతిసారం ప్రబలినట్టు స్థానికులు తెలిపారు.