
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మృతులు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్.. వరంగల్ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా.. ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 19 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గొండి మండలంలోని రంగాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో నీరుకుల్ల క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment