ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలి
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏప్రిల్ 9న ఆత్మకూరు నగర పంచాయతీ రెండో వార్డు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ఉప ఎన్నిక జరుగుతున్న ఆత్మకూరులో ఆయన పర్యటించారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను పోలీసులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది నిష్పక్షపాతంగా ఉండడంతోపాటు కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు సుధాకరరెడ్డి, సుబ్బయ్య ఉన్నారు.