మాతాశిశు మరణాలు అరికట్టడమే లక్ష్యం
సంగం : మాతాశిశు మరణాలను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీఎంహెచ్‌ఓ వరసుందరం తెలిపారు. మండల కేంద్రంలోని సంగం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గర్భిణి స్త్రీకి నాలుగో నెల నుంచి 9వ నెల వరకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,500 మంది గర్భిణులు ఉన్నారన్నారు. వీరి ఆరోగ్యాన్ని వైద్యారోగ్యశాఖ అనుక్షణం పరీశిలిస్తోందని చెప్పారు. బాల్య వివాహాలను తమ శాఖ సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు అరికట్టాలన్నారు. త్వరలో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. సంగం మండలంలో 108 సౌకర్యం లేకపోవడంతో వెంటనే 108 వాహనాన్ని సంగంకు సమకూర్చాలని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాగిణి, హెచ్‌ఈఓ హజరత్తయ్య పాల్గొన్నారు.