DMHO varasundaram
-
గర్భిణుల నమోదు పక్కాగా నిర్వహించాలి
డీఎంహెచ్ఓ వరసుందరం నెల్లూరు(అర్బన్): జిల్లాలోని గర్భిణుల వివరాలు పక్కగా వైద్య రికార్డుల్లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం «అధికారులను ఆదేశించారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం డివిజన్ల వారిగా వేర్వేరుగా విస్తరణాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సకాలంలో గర్భిణిని గుర్తించడం ద్వారా వారిలోని రక్తహీనతను, బీపీ, షుగర్ ఉండే హైరిస్కు కేసులను గుర్తించ వచ్చన్నారు. అలాంటి వారికి తగిన వైద్య సేవలు అందించడం ద్వారా రిస్క్‌ను తగ్గించవచ్చన్నారు. బాలింత సంరక్షణ, శిశు సంరక్షణ బాధ్యత ఆరోగ్య కార్యకర్తలదేనన్నారు. ప్రతి బిడ్డకీ 0 డోసు నుంచే టీకాలు వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది రికార్డులు, రిపోర్టులు సక్రమంగా నిర్వహించే విధంగా విస్తరణాధికారులు తనిఖీలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీఎల్ఓ రమాదేవి, ఆరోగ్య విస్తరణాధికారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ ఆగ్రహం కొడవలూరు : దోమల నివారణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకొంటానని డీఎంహెచ్ఓ వరసుందరం హెచ్చరించారు. మండలంలోని కొడవలూరు, రామన్నపాలెం సబ్సెంటర్లను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొడవలూరు మూలకట్ల సంఘం సబ్‌సెంటర్ వెనుకనే దోమల ఉత్పత్తికి కారణమైన లార్వా ఉండడాన్ని ఆయన గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లార్వా నివారణ పట్ల వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. సబ్సెంటర్లున్న ప్రాంతాల్లోనే లార్వా నిల్వలుంటే ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పరిస్థితేమిటని ప్రశ్నించారు. దోమల నివారణా చర్యల్లో విఫలమైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ప్రతి రోజూ నాలుగు గ్రామాల్లో పర్యటించి అబెట్ మందు చల్లి లార్వాను నివారించాలన్నారు. తనిఖీల్లో ఇది అమలు కావడంలేదని తేలితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఆయన వెంట వైద్యాధికారిణి కుసుమ, హెచ్ఏ షఫీ ఉద్దీన్, ఏఎన్ఎంలు ఎస్తేరమ్మ, జయశీల తదితరులున్నారు. l -
మాతాశిశు మరణాలు అరికట్టడమే లక్ష్యం
సంగం : మాతాశిశు మరణాలను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీఎంహెచ్ఓ వరసుందరం తెలిపారు. మండల కేంద్రంలోని సంగం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గర్భిణి స్త్రీకి నాలుగో నెల నుంచి 9వ నెల వరకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,500 మంది గర్భిణులు ఉన్నారన్నారు. వీరి ఆరోగ్యాన్ని వైద్యారోగ్యశాఖ అనుక్షణం పరీశిలిస్తోందని చెప్పారు. బాల్య వివాహాలను తమ శాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు అరికట్టాలన్నారు. త్వరలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. సంగం మండలంలో 108 సౌకర్యం లేకపోవడంతో వెంటనే 108 వాహనాన్ని సంగంకు సమకూర్చాలని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాగిణి, హెచ్ఈఓ హజరత్తయ్య పాల్గొన్నారు. -
పక్కాగా పీఎంఎస్ఏ విధానం అమలు
నెల్లూరు(అర్బన్): ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్(పీఎంఎస్‌ఎ) కార్యక్రమం ద్వారా ప్రతి నెలా తొమ్మిదో తేదీన గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించి మందులను అందజేసి వారిని ఇంటి వద్దకు చేర్చాలని డీఎంహెచ్ఓ వరసుందరం సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆశ నోడల్ ఆఫీసర్లకు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఎస్‌ఎ కార్యక్రమం కింద గర్భిణులకు భోజనం, ప్రయాణ వసతులను కల్పించాలని కోరారు. ఆశ వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను నోటీస్ బోర్డుల్లో ఉంచాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య శిక్షణ మండలి అధికారి పెద్దిశెట్టి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలి
డీఎం అండ్ హెచ్ఓ వరసుందరం వరికుంటపాడు, ఉదయగిరి వైద్యశాలలకు వైద్యులు.. నర్రవాడ(దుత్తలూరు): గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయిమచుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుంధరం కోరారు. మంగగళవారం నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో కాన్పు అయిన బాలింతకు జననీ శిశు సురక్ష యోజన కింద రూ.1000 ప్రభుత్వ ప్రోత్సాహక నగదు చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పుల శాతం పెరిగేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. న్రవాడు వైద్యాధికారి ఎస్.మురళి, ఆరోగ్య విస్తరణాధికారి కొండారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ షఫి, స్టాఫ్‌నర్స్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీ వరికుంటపాడు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వరసుందరం మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాన్పులు, ఓపి, మందుల నిల్వగదులను పరిశీలించారు. వైద్యశాలకు సంబంధించిన వివిధ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదిరోజుల్లో వైద్యశాలకు ఒక మహిళా వైద్యురాలిని, ఇద్దరు ఏఎన్ఎంలను నియమిస్తామన్నారు. అలాగే ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కూడా ఓ మహిళా వైద్యురాలిని నియమిస్తామన్నారు. ఆయనవెంట సీసీ మురళి, సూపర్వైజరు నూర్‌బాషా, స్టాఫ్‌నర్సు రోజారమణి, మెడాల్ ల్యాబ్ టెక్నీషియన్ సుప్రియ ఉన్నారు. -
ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం కలిగించండి
మనుబోలు : ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ వరసుందరం వైద్యులు, సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 60 శాతం మంది వైద్యులు మాత్రమే కచ్చితమైన సమయానికి హాజరవుతున్నారని, మిగిలిన 40 శాతం మంది సమయ పాలన పాటించడం లేదన్నారు. కొత్తగా వైద్యుల హాజరు కోసం టెలిగ్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సకాలంలో వైద్యులు వస్తేనే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్యను పెంచాలన్నారు. స్వచ్ఛభారత్ భాగంగా వివిధ శాఖల అధికారులు ఐదుగురు బృందంగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి దోమల నివారణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యానికి నిధుల కొరత లేదన్నారు. వీధుల్లో ఎక్కడైనా చెత్తా చెదారం కుప్పలు ఉన్నట్లైతే వాటిని ఫొటోలను ఆయా పరిధిలోని ఆర్డీఓ, వీఆర్వోలకు పంపితే వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆయన వెంట వైద్యులు విష్ణురావు, రమేష్, విజయలక్ష్మి, పీహెచ్ఎన్ నజీమున్నీసా, సిబ్బంది లలితమ్మ, రాజేష్, రాజన్ పాల్గొన్నారు. -
వైద్యాధికారులపై చర్యలకు సిఫార్సు
డీఎంహెచ్ఓ వరసుందరం యల్లాయపాలెం(కొడవలూరు): జిల్లాలోని కొడవలూరు, దగదర్తి, అనంతసాగరం పీహెచ్‌సీల వైద్యాధికారులపై చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేయడం జరిగిందని డీఎంహెచ్ఓ వరసుందరం తెలిపారు. యల్లాయపాళెం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులపై ఫిర్యాదులు అందగా విచారించి నివేదికను కలెక్టర్‌కు అందజేయడం జరిగిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. యల్లాయపాలెం పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఒకరు మాత్రమే ఉన్నారని తెలిపారు. సిబ్బందిని ప్రశ్నించగా సెలవుపై వెళ్లినట్లు చెప్పారని, ముందుగా సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పీహెచ్సీలో నాలుగేళ్లుగా కాన్పులు చేయడం లేదని, జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట వైద్యాధికారి రామకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ మేరి ప్రసాదిని, హెల్త్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి ఉన్నారు. -
పక్కాగా ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్
డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం నెల్లూరు(అర్బన్): జిల్లాలోని పీహెచ్సీలలోని డాక్టర్లందరూ ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను పక్కాగా అమలు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం సూచించారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ ఆస్పత్రి వల్ల బాధ్యత పెరుగుతుందన్నారు. ఏయే పరికరాలున్నాయి, మందులు, వైద్యం తదితర అన్ని రకాల వివరాలను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రోగులకు మెరుగైన సేవలందించవచ్చన్నారు. పీహెచ్సీలలో డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పని సరిగా ఉండాలన్నారు. బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయాలన్నారు. టీకాల కార్యక్రమం వంద శాతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రమాదేవి, పీఓడీటీ పి.రమాదేవి, డీఐఓ జయసింహ, డీటీసీవో సురేష్‌కుమార్, సమాచార అధికారి సాయిసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
దగదర్తి పీహెచ్‌సీని ప్రక్షాళన చేస్తాం
డీఎంఅండ్‌హెచ్‌వో వరసుందరం డాక్టర్ సహా సిబ్బందికి ఒకరోజు వేతనం నిలిపివేత దగదర్తి : దగదర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం అన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, పీహెచ్సీ డాక్టర్ జంషీరా అశ్రద్ధ కారణంగా నిండు గర్భిణణి మృతిచెందడంతోపాటు పీహెచ్సీ తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వరసుందరం మంగళవార ం ఉదయం 8.50 గంటలకే పీహెచ్‌సీకి చేరుకున్నారు. మందులు బయటే పడేసి ఉండటం గమనించి సిబ్బంది కోసం ఎదురుచూశారు. 9.30 గంటలకు అటెండర్ రాగా, 9.45 గంటలకు స్టాప్ నర్స్, 9.55 ఆయుష్ సిబ్బంది ఒకరు, మెడాల్ సిబ్బంది ఒకరు వచ్చారు. దీంతో రికార్డులు పరిశీలించి డాక్టర్ సహా సిబ్బంది మొత్తానికి ఒకరోజు వేతనాన్ని నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తురిమెర్ల పీహెచ్సీ తనిఖీ చేశారు. అక్కడ గైర్హాజరైన సిబ్బందికి కూడా వేతనం నిలిపేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ రెండు పీహెచ్‌సీలు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్షం వహించే సిబ్బంది పనితీరుపై కఠిన చర్యలు తప్పవన్నారు. దగదర్తి పీహెచ్సీ పరిధిలో గిరిజన గర్భిణి మృతిచెందిన ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఏఎన్‌ఎంతోపాటు డాక్టర్‌పై కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎవరా టీడీపీ నేత..? నిండు గర్భిణి మృతికి కారణమైన పీహెచ్సీ డాక్టర్, సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టకుండా ఓ టీడీపీ నేత ఎంపీపీ పేరుతో నేరుగా డీఎంఅండ్హెచ్కి ఫోన్ చేసి డాక్టర్ పనితీరు బాగుందని, పుకార్లు నమ్మొద్దని బతిమాలినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సదరు టీడీపీ నేతపై మండిపడుతున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోకుంటే ఊరుకునేది లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు.