వైద్యాధికారులపై చర్యలకు సిఫార్సు | Action to be taken on doctors | Sakshi
Sakshi News home page

వైద్యాధికారులపై చర్యలకు సిఫార్సు

Published Wed, Sep 14 2016 10:52 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

వైద్యాధికారులపై చర్యలకు సిఫార్సు - Sakshi

వైద్యాధికారులపై చర్యలకు సిఫార్సు

  • డీఎంహెచ్‌ఓ వరసుందరం
  • యల్లాయపాలెం(కొడవలూరు): జిల్లాలోని కొడవలూరు, దగదర్తి, అనంతసాగరం పీహెచ్‌సీల వైద్యాధికారులపై చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేయడం జరిగిందని డీఎంహెచ్‌ఓ వరసుందరం తెలిపారు. యల్లాయపాళెం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులపై ఫిర్యాదులు అందగా విచారించి నివేదికను కలెక్టర్‌కు అందజేయడం జరిగిందన్నారు.  కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. యల్లాయపాలెం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఒకరు మాత్రమే ఉన్నారని తెలిపారు. సిబ్బందిని ప్రశ్నించగా సెలవుపై వెళ్లినట్లు చెప్పారని, ముందుగా సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పీహెచ్‌సీలో నాలుగేళ్లుగా కాన్పులు చేయడం లేదని, జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట వైద్యాధికారి రామకృష్ణ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మేరి ప్రసాదిని, హెల్త్‌ అసిస్టెంట్‌ ఉమామహేశ్వరి ఉన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement