గర్భిణుల నమోదు పక్కాగా నిర్వహించాలి
-
డీఎంహెచ్‌ఓ వరసుందరం
నెల్లూరు(అర్బన్):
జిల్లాలోని గర్భిణుల వివరాలు పక్కగా వైద్య రికార్డుల్లో నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వరసుందరం «అధికారులను ఆదేశించారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం డివిజన్ల వారిగా వేర్వేరుగా విస్తరణాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సకాలంలో గర్భిణిని గుర్తించడం ద్వారా వారిలోని రక్తహీనతను, బీపీ, షుగర్ ఉండే హైరిస్కు కేసులను గుర్తించ వచ్చన్నారు. అలాంటి వారికి తగిన వైద్య సేవలు అందించడం ద్వారా రిస్క్‌ను తగ్గించవచ్చన్నారు. బాలింత సంరక్షణ, శిశు సంరక్షణ బాధ్యత ఆరోగ్య కార్యకర్తలదేనన్నారు. ప్రతి బిడ్డకీ 0 డోసు నుంచే టీకాలు వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది రికార్డులు, రిపోర్టులు సక్రమంగా నిర్వహించే విధంగా విస్తరణాధికారులు తనిఖీలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీఎల్‌ఓ రమాదేవి, ఆరోగ్య విస్తరణాధికారులు పాల్గొన్నారు.