ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలి | DMHO visits PHC | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలి

Published Wed, Oct 26 2016 1:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలి - Sakshi

ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలి

  •  డీఎం అండ్‌ హెచ్‌ఓ వరసుందరం
  •  వరికుంటపాడు, ఉదయగిరి వైద్యశాలలకు వైద్యులు..
  • నర్రవాడ(దుత్తలూరు): గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయిమచుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వరసుంధరం కోరారు. మంగగళవారం నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో కాన్పు అయిన బాలింతకు జననీ శిశు సురక్ష యోజన కింద రూ.1000 ప్రభుత్వ ప్రోత్సాహక నగదు చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పుల శాతం పెరిగేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. న్రవాడు వైద్యాధికారి ఎస్‌.మురళి, ఆరోగ్య విస్తరణాధికారి కొండారెడ్డి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ షఫి, స్టాఫ్‌నర్స్‌ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
    పీహెచ్‌సీ తనిఖీ
    వరికుంటపాడు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వరసుందరం మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాన్పులు, ఓపి, మందుల నిల్వగదులను పరిశీలించారు. వైద్యశాలకు సంబంధించిన వివిధ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదిరోజుల్లో వైద్యశాలకు ఒక మహిళా వైద్యురాలిని, ఇద్దరు ఏఎన్‌ఎంలను నియమిస్తామన్నారు. అలాగే ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కూడా ఓ మహిళా వైద్యురాలిని నియమిస్తామన్నారు. ఆయనవెంట సీసీ మురళి, సూపర్‌వైజరు నూర్‌బాషా, స్టాఫ్‌నర్సు రోజారమణి, మెడాల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ సుప్రియ ఉన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement