Published
Thu, Sep 15 2016 11:27 PM
| Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఆత్మకూర్ (ఎస్) : రెండేళ్ల కేసీఆర్ పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, గజ్వేల్‌లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిపుణులు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా మొండిగా భూసేకరణ చేపట్టి రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. 2013 కేంద్ర ప్రభుత్వ చట్టప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 19, 20వ తేదీల్లో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టే రెండు రోజుల దీక్షకు రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు షఫీఉల్లా, దారోజు జానకిరాములు, రమణాచౌదరి, నామా ప్రవీణ్, సోమయ్య, కోతి మల్లయ్య, నీలం కృష్ణ పాల్గొన్నారు.