బైక్‌ సీటులో పాము.. ఒక్కసారిగా భయాందోళనకు గురై.. | Snake Found Under Bike Seat In Nellore District | Sakshi
Sakshi News home page

బైక్‌లో పాము హల్‌చల్‌ 

Published Sun, Feb 21 2021 12:46 PM | Last Updated on Sun, Feb 21 2021 1:04 PM

Snake Found Under Bike Seat In Nellore District - Sakshi

బైక్‌లోని పామును తీస్తున్న మెకానిక్‌   

ఆత్మకూరు: బైక్‌ సీటు దెబ్బతినడంతో కొత్త కవరు కుట్టించుకునేందుకు మెకానిక్‌ షెడ్డుకు వచ్చి సీటును తొలగిస్తుండగా బైక్‌లో ఓ పాము కనబడడంతో వారు ఆందోళన చెందన సంఘటన ఆత్మకూరు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. చేజర్ల మండలం భిల్లుపాడు గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ తన బైక్‌కు సీటు కవరు కుట్టించుకునేందుకు ఆత్మకూరులోని ఆటోనగర్‌ వద్దకు వచ్చాడు.

మెకానిక్‌ బైక్‌ సీటును ఊడదీయగా అందులో పాము కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. మెకానిక్‌ మున్వర్‌ ధైర్యం చేసి పామును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంటకు పైగా పాము వెలుపలికి రాకపోవడంతో చివరకు జాగ్రత్తగా బైక్‌ విడిభాగాలు ఊడదీసి పామును చంపేశారు. బైక్‌లో  పామును తిలకించేందుకు పలువురు ఆసక్తిగా గుమిగూడారు.

చదవండి: 
జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం  

డోర్‌ డెలివరీ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తల దాడి 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement