స్వచ్ఛభారత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
-
జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి
ఆత్మకూరురూరల్ : పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛభారత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ నిర్మలాదేవితో కలిసి పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2015–16 ఏడాదికి పంచాయతీల జమా ఖర్చుల వివరాలు (క్రియోసాఫ్ట్) ఏ మేరకు పూర్తి చేసింది పరిశీలించారు. ఇంకా నమోదు చేయని వారిని మరో వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక‌్షన్ కోసం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఒక్కోదానికి రూ.850 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటికీ పంచాయతీ, మున్సిపాలిటీలో 38 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఎంఈఓ మణిప్రసాద్, సీడీపీఓ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.