కాల్వలో పడి చిన్నారి మృతి | child died in canal | Sakshi
Sakshi News home page

కాల్వలో పడి చిన్నారి మృతి

Published Sat, Sep 24 2016 10:15 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

కాల్వలో పడి చిన్నారి మృతి - Sakshi

కాల్వలో పడి చిన్నారి మృతి

ఆత్మకూర్‌(ఎస్‌) కాల్వలో పడి చిన్నారి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని కందగట్ల ఆవాసం మంగళితండాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

ఆత్మకూర్‌(ఎస్‌)
 కాల్వలో పడి చిన్నారి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని కందగట్ల ఆవాసం మంగళితండాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భానోత్‌ రవి–భారతిల కుమార్తె అఖిల (4)ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులోని రోడ్డు వెంట కాల్వలో పడిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాల్వల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక చనిపోయింది. సాయంత్రం వరకూ అఖిల ఇంటì కి చేరకపోవడంతో తల్లితండ్రులు చుట్టుపక్కల వెదకగా కాల్వలో విగతజీవిగా కనిపించింది. అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న కుమార్తె మరణంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement