ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లు
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధారిటీ కార్యాలయంలో స్వైప్‌మిషన్లు ఏర్పాటుచేసినట్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం వద్దనున్న కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీటిని ఏర్పాటుచేశామన్నారు. లైసెన్సుల కోసం చెల్లించే ఫీజులు, అపరాధరుసుం స్వైపింగ్ మిషన్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా సరైన పత్రాలు లేకుండా సరుకు రవాణా చేస్తున్న వాహనాల నుంచి రూ.40 వేలు అపరాధరుసుం శుక్రవారం వసూలు చేసినట్లు మాధవరావు తెలిపారు.